పట్టు చీరలు పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే కాస్త జాగ్రత్త , కాస్త టైం spend చేయాలి. ఆ జాగ్రత్తలు ఏమిటో చూద్దము.
- పట్టీలు వేసుకునే అలవాటు ఉంటె తప్పకుండా పట్టు చీరలకు FALLS కుట్టాలి. Falls కుట్టడం వలన చీర కట్టుకునేటప్పుడు కింద folds పడకుండా అలాగే జరిపోగులు కాళ్ళ పట్టీలకు పట్టకుండా ఉంటాయి.
- కట్టుకున్న చీరని కాస్త గాలి తగిలేలాగా వేసి fold చేసుకోవాలి.
- మరకలు, మట్టి అంటుకున్న చోట తడిబట్టతో తుడవాలి.
- మరీ మొండి మరకలు అయితే పెట్రోల్ లో నానబెట్టిన బట్టతో తుడవాలి లేదా నిమ్మరసం లో కొంచం వాటర్ కలిపి రుద్దాలి. Direct గా నిమ్మరసం తో రుద్దితే fade ఆయే అవకాసం ఉంది.
- Plastic cover లో కాడుండా muslin cloth bag లో గాని పలచటి towels లాంటి బట్టలో గాని పెట్టి బద్రపరుచుకోవాలి.
- చీరలు బద్రపరిచే cupboard లో తప్పకుండా newspaper గాని brown cover గాని వేయాలి. Paper నాలుగు ప్రక్కల కింద లవంగ మొగ్గలు లేదా సుబ్రపరిచిన వేప ఆకులు (neem leaves ) వేస్తె insects , bugs వంటివి చేరావు.
- Naphthalene balls వెస్తే, అవి బట్టలో కట్టి paper కింద వేయాలి.
- పట్టుచిరలు నెల కి ఒక్కసారి అయిన నీడలో గాలి తగిలేలా వేసి, మడతలు మార్చాలి. నెలకి వీలుకాకపోయిన కనీసం 3months ఒక్కసారి అయిన మడతలు మార్చాలి . లేకుంటే మడతలు దగ్గర చిరిగే ప్రమాదం ఉంది.
- Underarms కి చెమట వలన blouse త్వరగా చిరగడం మచ్చలు పడటం లాంటివి జరుగుతుంటాయి . Underarms sweat pads ఉపయోగించడం మంచిది. ఇవి ప్రతి fancy stores లో supermarkets లో దొరుకుతాయి.
- First time చీరను ఉతికేతప్పుడు water లో కొంచం salt వేసి చీరను నానబెట్టాలి. తర్వాత చల్లని water లో బాగా rinse చేయాలి.
- Detergent soap కాకుండా soapnuts (కుంకుడుకాయలు) తో వాష్ చేసుకోవాలి. (పలచటి రసం లో ఉతకాలి).
- Falls దగ్గర కాని జరి మీద కాని brush ఉపయోగించకూడదు. ఇలా చేస్తే జరిపోగులు తెగి చీర పాడవుతుంది.
- Pallu (చిర కొంగు ), చీరను విడిగా ఉతకాలి.
- తడి చీరను కుప్పల కాకుండా నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టేటప్పుడు చీర boby , pallu , boarder కాస్త stretch చేస్తే, ఇస్త్రి చేసుకోవడం సులువు అవుతుంది. ఎక్కువ సేపు నీటిలో కూడా ఉంచకూడదు.
- పట్టు చీరను IRON చేసేటప్పుడు medium వేడి మీద చేసుకోవాలి. లేదా cotton బట్ట చిర మీద వేసి IRON చేసుకోవాలి. లేదా చీరను తిప్పి IRON చేసుకుంటే ఇంకా మంచిది.
- వేడి వేడి ఇస్త్రి చేసిన చీరను వెంటనే fold చేయకూడదు ఎందుకంటే జరి నల్లబడే అవకాసం ఉంది. కాస్త వేడి చల్లారిన తరవాత fold చేసుకొని బద్రపరుచుకోవాలి.
Though i know a few tips,they are pretty much informative.
ReplyDeleteKanthi Garu Thanks a lot.
ReplyDelete