Showing posts with label SAREES. Show all posts
Showing posts with label SAREES. Show all posts

Saturday, July 17, 2010

KANCHI PATTU SAREES

   
              పట్టు చీరలు పదికాలాల పాటు పదిలంగా  ఉండాలంటే కాస్త జాగ్రత్త , కాస్త టైం spend చేయాలి. ఆ జాగ్రత్తలు ఏమిటో చూద్దము.
  • పట్టీలు వేసుకునే అలవాటు ఉంటె తప్పకుండా పట్టు చీరలకు  FALLS కుట్టాలి. Falls కుట్టడం వలన చీర కట్టుకునేటప్పుడు కింద folds పడకుండా అలాగే జరిపోగులు కాళ్ళ పట్టీలకు పట్టకుండా ఉంటాయి.

  • కట్టుకున్న  చీరని కాస్త గాలి తగిలేలాగా వేసి fold చేసుకోవాలి. 
  • మరకలు, మట్టి అంటుకున్న  చోట తడిబట్టతో తుడవాలి. 
  • మరీ మొండి మరకలు అయితే పెట్రోల్ లో నానబెట్టిన బట్టతో తుడవాలి లేదా నిమ్మరసం  లో కొంచం వాటర్ కలిపి రుద్దాలి. Direct గా నిమ్మరసం తో రుద్దితే fade ఆయే అవకాసం ఉంది.
  • Plastic cover లో కాడుండా muslin cloth bag లో గాని  పలచటి towels లాంటి బట్టలో గాని   పెట్టి బద్రపరుచుకోవాలి.
                                          MUSLIN BAGS (brown )
  • చీరలు బద్రపరిచే cupboard లో తప్పకుండా newspaper గాని brown cover గాని వేయాలి. Paper నాలుగు ప్రక్కల కింద లవంగ మొగ్గలు లేదా సుబ్రపరిచిన వేప ఆకులు (neem leaves ) వేస్తె insects , bugs వంటివి  చేరావు.
  • Naphthalene balls  వెస్తే, అవి బట్టలో కట్టి paper కింద వేయాలి.
  • పట్టుచిరలు నెల కి ఒక్కసారి అయిన నీడలో గాలి తగిలేలా వేసి,  మడతలు మార్చాలి. నెలకి వీలుకాకపోయిన కనీసం 3months ఒక్కసారి అయిన మడతలు మార్చాలి . లేకుంటే మడతలు దగ్గర చిరిగే ప్రమాదం ఉంది. 
  • Underarms కి చెమట వలన blouse త్వరగా చిరగడం మచ్చలు పడటం లాంటివి జరుగుతుంటాయి .  Underarms sweat pads ఉపయోగించడం మంచిది. ఇవి ప్రతి fancy stores లో supermarkets లో  దొరుకుతాయి. 
    • First time చీరను ఉతికేతప్పుడు water లో కొంచం salt వేసి చీరను నానబెట్టాలి. తర్వాత చల్లని water లో బాగా rinse చేయాలి.
    • Detergent soap కాకుండా soapnuts  (కుంకుడుకాయలు) తో వాష్ చేసుకోవాలి. (పలచటి రసం లో ఉతకాలి). 

    • Falls దగ్గర కాని జరి మీద కాని brush ఉపయోగించకూడదు. ఇలా చేస్తే జరిపోగులు తెగి చీర పాడవుతుంది.
    • Pallu  (చిర కొంగు ), చీరను  విడిగా ఉతకాలి.
    • తడి చీరను కుప్పల కాకుండా నీడలో ఆరబెట్టాలి. ఆరబెట్టేటప్పుడు చీర boby , pallu , boarder కాస్త stretch చేస్తే, ఇస్త్రి చేసుకోవడం సులువు అవుతుంది. ఎక్కువ సేపు నీటిలో కూడా ఉంచకూడదు.

    • పట్టు చీరను IRON చేసేటప్పుడు medium  వేడి మీద చేసుకోవాలి. లేదా cotton బట్ట  చిర మీద వేసి IRON చేసుకోవాలి. లేదా  చీరను తిప్పి IRON చేసుకుంటే ఇంకా మంచిది. 
    • వేడి వేడి ఇస్త్రి చేసిన చీరను వెంటనే  fold చేయకూడదు ఎందుకంటే జరి నల్లబడే అవకాసం ఉంది.  కాస్త వేడి చల్లారిన తరవాత fold చేసుకొని బద్రపరుచుకోవాలి.
                     
        Related Posts Plugin for WordPress, Blogger...